Tuesday, February 22, 2011

అస్తవ్యస్థ 'సంస్కరణల' పుణ్యమే ఈ అంతులేని అవినీతి


(ప్రజాశక్తి తెలుగు దినపత్రికలోని సాయినాథ్ గారి వ్యాసం ) 

 

ఎలక్ట్రానిక్‌మీడియాలోని కొద్దిమంది తన ప్రియ శిష్యులతో ప్రొఫెసరుగారు (మన్మోహన్‌సింగ్‌) జరిపిన చర్చాగోష్టిపై రెండు దశాబ్దాలుగా ఆయనకు భజన చేస్తున్న ఈ ప్రసార మాధ్యమ అధినేతలు, సంపాదకులు సైతం పెదవి విరిచారు. చర్చాగోష్టిలో వారు ఆయననేమీ బాధించలేదు. ఇరుకున పెట్టే ప్రయత్నం అంతకన్నా చేయలేదు. తనకు తోచిన విధంగా మాట్లాడుకునేందుకు ఆయనకు అవకాశమిచ్చారు. సంపాదకుల పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గాలేదు. అవినీతి గురించి కొంత భావోద్వేగంతో ప్రశ్నించినా, సంవత్సరాల తరబడి తాము ఆరాధిస్తున్న విధానాల నుండే ఈ అవినీతి పుట్టుకొచ్చిందనే విషయం దగ్గరకొచ్చేసరికి మౌనం దాల్చారు.

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన ఒక అంశంతో మీరు ఏకీభవించాలి. ఆయనది కుంటి సర్కార్‌ కాదు. నిజానికి ఆయనను 'వంట ఇంటి కుందేలు ప్రభుత్వం ' అంటే సరిగ్గా అతుకుతుంది. ఏదియేమైనప్పటికీ గత పది రోజులుగా లక్ష కోట్ల రూపాయల సరికొత్త కుంభకోణమేదీ బయటపడలేదంటే, పరిస్థితి కొంత మెరుగుపడినట్లు అనుకోవచ్చునన్న మాట. ఎంపిక చేసిన కొద్దిమంది తన ప్రియ శిష్యులతో ప్రొఫెసరుగారు జరిపిన చర్చాగోష్టి పై రెండు దశాబ్దాలుగా డాక్టర్‌ సింగ్‌కు భజన చేస్తున్న ఎలక్ట్రానిక్‌ ప్రసార మాధ్యమ అధినేతల, సంపాదకులు సైతం పెదవి విరిచారు. చర్చాగోష్టిలో వారు ఆయననేమీ బాధించలేదు. ఇరుకున పెట్టే ప్రయత్నం అంతకన్నా చేయలేదు. తనకు తోచిన విధంగా మాట్లాడుకునేందుకు ఆయనకు అవకాశమిచ్చారు. సంపాదకుల పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గాలేదు. సరియైన ప్రశ్నలను సంధించడమే పాత్రికేయ వృత్తికి ఆయువుపట్టు. ఆ విధంగా చూసినప్పుడు కొందరు దారి తప్పారనే చెప్పాలి. అవినీతి గురించి కొంత భావోద్వేగంతో ప్రశ్నించారు. అయితే, సంవత్సరాల తరబడి తాము ఆరాధిస్తున్న విధానాల నుండే ఈ అవినీతి పుట్టుకొచ్చినప్పటికీ వాటి గురించి మాత్రం ప్రస్తావించలేదు.
కొన్ని ప్రశ్నలైతే ఆందోళనలో చిక్కుకున్న సంపాదకుల అవసరాన్ని సూచిస్తున్నాయి. ఇప్పటి విధానాలే కొనసాగుతున్నాయన్న హామీని వారు తిరిగి పొందారు. ఉదాహరణకు, 'యుపిఏ-2 నుంచి బ్రహ్మాండమైన వెల్లువ రావటం లేదన్న' భయం ఉన్నది. కఠినమైన సంస్కరణల నిర్ణయాలను తీసుకునే శక్తిని కోల్పోయామా? 'అలాంటిదేమీ లేదన్నదే' ప్రధాని సమాధానం. 'మనం శక్తిని కోల్పోలేదు, మనం గట్టిగా నిలబడగలమని ప్రధాని నొక్కి చెప్పారు. సంస్కరణలు సరైన గాడిలోనే ఉన్నాయన్నది ఆయన ఉవాచ. డాక్టర్‌ సింగ్‌ నిజం పలికారు. సంపాదకులు కాస్త ఆలోచనకు పదును పెట్టినట్లయితే తమను కలవరపరుస్తున్న అస్తవ్యస్థత, అవినీతి ఆ 'సంస్కరణల' పుణ్యమేనని అర్థమైవుండేది.
అవినీతికి సంబంధించిన ప్రశ్నలు సైతం కొంతమంది మంత్రుల చర్యల చుట్టూ తిరిగాయి. ప్రొఫెసర్‌గారు చూపుతున్న దారి విధ్వంసకరమైనదీ, ప్రమాదకరమైనదీ అన్న విషయాన్ని ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కటీ వ్యక్తం చేయలేకపోయాయి. 1991 నుంచి ఉనికిలోకి వచ్చిన నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అద్భుతమూ, ఆశ్చర్యమూ అంటూ ఒక్కసారి పొగిడినట్లయితే సహజంగానే వారి ప్రశ్నలకు పరిమితి ఉంటుంది. కార్పొరేట్‌ నేర స్వభావం రీత్యా మరో మార్గం లేనప్పుడు లేదా ఏ పరిణామాన్నయినా ఎదుర్కోవటానికి సిద్ధపడినపుడు మాత్రమే సంపాదకులు అలాంటి ప్రశ్నలు వేయగలరు.
కాస్త చెప్పుకోదగిన మొట్టమొదటి ప్రశ్న ఏమంటే 2జి కుంభకోణం గురించి, అలానే స్పెక్ట్రమ్‌ను వేలం వేయకపోవటం గురించి అడిగినది. ఇక్కడొక విషయం ప్రస్తావనకు రాలేదు. నిజానికి, స్పెక్ట్రమ్‌ వేలం జయప్రదంగా జరిగింది. అయితే, దీనిని ప్రభుత్వం కాక, కార్పొరేట్‌ రంగ ఆశ్రితులు (కార్పొరేట్‌ సెక్టార్‌ క్రోనీస్‌) నిర్వహించారు. నామమాత్రమైన ధరలకు లభించిన అపురూపమైన ఈ దేశ వనరును ప్రైవేటుగా వేలం వేసి అనూహ్యమైన ధరకు అమ్ముకున్నారు. ప్రైవేటు కంపెనీలకు చౌకగా లభించినందునే వినియోగదారులకు చౌకగా అందుబాటులోకి వచ్చిందంటూ చేసే వాదన మోసపూరితమైనదే. ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొందిన కంపెనీలు వాటిని తిరిగి రెట్టింపు ధరలకు అమ్మినప్పటికీ ఖాతాదారులకు చౌక ధరలకే లభిస్తున్నాయి. ఈ కంపెనీలు స్వయంగా నిర్వహించిన వేలం పాటల ద్వారా అపారమైన లాభాలు పోగేసుకున్నాయి. ఈ పరిస్థితే లేకుంటే వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరి ఉండేది.
చచ్చు ప్రశ్న
ఇకపోతే 'నల్లధనం' గురించి వేసిన చచ్చు ప్రశ్న, వాటికి వచ్చిన సమాధానం వేదాంతులకు అర్థమవుతుందేమో కానీ, సామాన్యులకు అర్థమయ్యే ఆస్కారమే లేదు. భారతదేశంలోని అక్రమ సంపాదన సముద్రాలు దాటి స్విస్‌ లేదా ఇతర బ్యాంకులకు తరలుతుండడం గురించి ఎవరూ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. విదేశాల్లో రహస్య ఖాతాలున్న వారి పేర్లను ప్రభుత్వం బయట పెట్టకపోటానికి కారణం ఏమిటని ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. అక్రమ మార్గాలలో సంపాదించిన డబ్బు విదేశాలకు తరలిపోతున్నదని, ఈ తరలింపు సగటున రోజుకు సుమారు రూ.240 కోట్లు ఉంటుందని గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటిగ్రిటి అనే సంస్థ పేర్కొన్నది. 2004 నుంచి 2008 మధ్య రూ.4.3 లక్షల కోట్లను (2జి కుంభకోణంలో నష్టపోయిన దానికన్నా రెట్టింపు) దేశం నష్టపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో దోషులెవరు? భారతదేశంలోని ప్రైవేటు రంగం నుంచి అక్రమంగా ధనం తరలి పోవటానికి ఉన్నతస్థాయి వ్యక్తులు, ప్రైవేటు కంపెనీలే ప్రధాన కారణం. ఈ విషయాల గురించి ప్రధాన మంత్రిని ప్రశ్నలు వేసివుంటే బాగుండేది. కాని ఎవరూ అడగలేదు. ఇలాంటి నేరస్తులకు ఆయనగారి ప్రభుత్వం ప్రకటించదలచుకున్న క్షమాభిక్ష లేదా మినహాయింపు పథకాల గురించిన ప్రశ్నలు కూడా రాలేదు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా విలాసరావు దేశముఖ్‌ను ప్రధాని నియమించటంలోని ఔచిత్యం గురించీ, నైతికత గురించీ సంపాదకులు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మహారాష్ట్రలో వడ్డీ వ్యాపారులకు రక్షణగా నిలబడినందుకుగాను సర్వోన్నత న్యాయస్థ్ధానం అభిశంసనలను ఎదుర్కొన్న వ్యక్తి ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధికి బాధ్యుడుగా ఉన్నాడు. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థ్ధానం విధించిన రూ.10 లక్షల జరిమానాను చెల్లించింది. అంటే, ముఖ్యమంత్రిగా విలాసరావు ఉండగా తప్పు జరిగిందని అంగీకరించడం అన్నమాట. ఈ ఉదంతంలో 'సంకీర్ణ ధర్మ' అన్న వాదనను ప్రధాని చేయలేరు. ఎందుకంటే, ఈ దేశముఖ్‌గారు ఆయన స్వంత పార్టీకి చెందిన వారే. సుప్రీం కోర్టు చివాట్లు పెట్టిన తరువాత కూడా ఆయన కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారంటే అందుకు కారణం మన్మోహన్‌ సింగ్‌గారు ఆయనను కావాలనుకోవటమే. కామన్వెల్త్‌ కుంభకోణంలో సైతం 'సంకీర్ణ ధర్మం' అన్న వాదన చెల్లదు. అయినప్పటికీ దీని గురించి కూడా ఎలాంటి ప్రశ్నలు అడగలేదు.
1995 నుంచి ఈ దేశంలో ఆత్మహత్యలకు పాల్పడిన రెండున్నర లక్షల మంది రైతుల గురించి ఈ సంపాదకులు ప్రధానిని ప్రశ్నిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. పొట్టచేతపట్టుకుని గ్రామాలను వదలి వెళ్తున్న వారి గురించి కూడా వీరికి ఏమీ పట్టలేదు. అలానే పెరుగుతున్న నిరుద్యోగం గురించీ, ఆకలి బాధల గురించీ ఒక్క ప్రశ్న కూడా రాలేదు. వృద్ధ్ది రేటు 8.5 శాతం ఉన్న దేశంలో ఆహార పదార్థాల ధరలు పెరగటం గురించి ఒకేఒక్క ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న వేసింది విదేశీయుడు కావటం విశేషం. తమ ఛానెల్స్‌ను చూసే మధ్య తరగతి వీక్షకులు సైతం ఈ ధరల పెరుగుదల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి సంపాదకులకు తెలుసు. కాని, సిఎన్‌ఎన్‌కు చెందిన శారా సిడ్నర్‌ మాత్రమే తత్సంబంధిత ప్రశ్న వేశారు. ద్రవ్యోల్బణానికి సంబంధించిన మరో ప్రశ్న ఏమంటే, వ్యవసాయ రంగంలో రెండవ విడత వ్యవస్థాగత సంస్కరణలకు సంబంధించినది. ధరల పెరుగుదల గురించి (పేదల ఆకలికి సంబంధించినది కాదు) వచ్చిన మరో ప్రశ్నకు సమాధానం రాలేదు. 2జి కుంభకోణంలో వచ్చిన నష్టాన్ని పేదలకిచ్చే సబ్సిడీతో ప్రధాని పోల్చినపుడు దానికెవరూ అభ్యంతరం చెప్పలేదు. ''వేలం పాటలు జరగనపుడు నష్టాన్ని అంచనా వేయడానికి మీకున్న ప్రాతిపదిక ఏమిటి?.....అది మీ అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. మన బడ్జెట్‌లో ఆహారానికి ఏడాదికి రూ.80,000 కోట్ల సబ్సిడీని ఇస్తున్నాము. ఈ ఆహార ధాన్యాలను మార్కెట్‌ ధరలకు అమ్మవచ్చుగదా అని ఎవరైనా అడగవచ్చు. మార్కెట్‌ ధరకు అమ్మకపోవటం వలనా, సబ్సిడీ ఇస్తున్నందున రూ.80,000 కోట్ల నష్టం వస్తుందని ఎవరైనా అనగలరా?'' ఇదీ ప్రధాని వితండ వాదం.
దోపిడీ-సబ్సిడీ
మొట్టమొదటి విషయమేమంటే, దోపిడీని, ప్రపంచంలోనే అత్యధికంగావున్న అన్నార్తులకిచ్చే కొద్దిపాటి సబ్సిడీలతో పోల్చటం. ప్రపంచ ఆకలి సూచిలోని 87 దేశాలలో మన దేశం 67వ స్థానంలో ఉన్నది. రెండవదేమంటే, కోటీశ్వరులకు ఇచ్చే సబ్సిడీలు ప్రతియేటా పెరుగుతున్నాయి. అదే సమయంలో కోట్లాదిమంది అన్నార్తులకిచ్చే సబ్సిడీలలో ప్రభుత్వం గత బడ్జెట్‌లో రూ.450 కోట్ల మేరకు కోత పెట్టింది. కార్పొరేట్‌ ప్రపంచానికి మాత్రం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ అవకాశం వచ్చినప్పుడల్లా వేల కోట్ల రూపాయల మేర పన్నుల రాయితీలు ఇస్తున్నది. దీనిని కార్పొరేట్‌ పన్ను మాఫీ అనొచ్చు. గత బడ్జెట్‌లో కేవలం మూడు పద్దులు (కార్పొరేట్‌ రాబడి పన్ను, కస్టమ్‌, ఎక్సైజు సుంకాలు) కింద నేరుగా అయిదు లక్షల కోట్ల రాయితీలిచ్చింది. అంటే ఇది 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో నష్టపోయిన సొమ్ము కన్నా రెండున్నర రెట్లు ఎక్కువన్నమాట. ప్రతి బడ్జెట్‌లోనూ సింహభాగం కార్పొరేట్‌ రంగానికే దక్కుతున్నది. ప్రజా ధనాన్ని దోచుకుంటున్న కార్పొరేట్‌ సంస్థల గురించి ప్రధాన స్రవంతికి చెందిన ప్రసార మాధ్యమం ఎన్నడూ నిరసన తెలిపిన పాపానపోలేదు. ప్రధానితో సాగిన ఈ చర్చాగోష్టిలో కూడా వారు ఆ పని చేయలేదు. 2జి కుంభకోణంలో కొంతమంది బడా బాబులకు చిరు కానుకగా ఇచ్చిన సొమ్ము (లక్షా 76వేల కోట్లు) గురించి అడిగినప్పుడు ప్రధాని చిరాకుపడ్డారు. వెంటనే ఆహార సబ్సిడీ కింద ఇచ్చే రూ.80,000 కోట్లను కూడా మీరు నష్టంగా పరిగణిస్తున్నారా అని సంపాదకులను ఆయన ఎదురు ప్రశ్నించారు. వాళ్ళలో ఎక్కువ మంది అలానే భావిస్తున్నారు. పేదలకిచ్చే సబ్సిడీలన్నిటినీ రద్దు చేయాలని కొందరు కోరుతున్నారు. వీరిలో కొందరు పేదలకు నేరుగా సబ్సిడీలు ఇవ్వడం సరికాదంటున్నారు. దీనినే రాజకీయంగా నాజూకైన పదాలలో ''వ్యవస్థను చక్కదిద్దాలి'', ''లక్ష్యాలను సరిగా నిర్దేశించుకోవాలి'', ''సామర్థ్యం పెరగాలి '' వ్యక్తం చేస్తుంటారు. అయితే, శత కోటీశ్వరులకు ( (వీరిలోమీడియా యజమానులు కూడా వున్నారు) సునామీ వలె పెద్ద యెత్తున ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంటే దానిపై ఎన్నడైనా ఇటువంటి డిమాండ్‌ చేశారా?
ఒక సానుకూలాంశమేమిటంటే ఎడిటర్లతో నిర్వహించే చర్చాగోష్టిలో ఎటువంటి మంత్రుల బృందం వుండదనడం. బహుశా మంత్రుల బృందాల గణనకు వారి అవసరముందనుకున్నారో ఏమో! ప్రధాని హాజరయ్యే ప్రతి సమావేశంలోనూ కనిపించే ప్రణబ్‌ ముఖర్జీని కూడా పక్కన పెట్టడం గురించి అడిగితే ఆయన ఎక్కడ ఇబ్బంది పడతారోనని దానిని కూడా విడిచిపెట్టారు.

Saturday, February 19, 2011

నీ ప్రశ్నలు నీవే…

నీ ప్రశ్నలు నీవే…

ఇది సౌమ్యశ్రీ రచన   
ఈ టపా రాయకూడదు అని చాలా ట్రై చేసా – ఎందుకంటే చెప్పలేను. మరీ పెస్సిమిస్టిగ్గా అనిపిస్తుందని నా అనుమానం అని నేననుకుంటున్నాను. అయినా, ఆ పదాలలా ఉంటే నేనేం చేస్తాను గానీ, అది మరీ నన్నలా పడుకున్నా లేచినా నిల్చున్నా, కూర్చున్నా వెంటాడుతూ ఉంటే – ఇక రాయకుండా ఉండలేకపోతున్నా. ఆ టైటిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా, దేని గురించి మాట్లాడుతున్నానో – “కొత్త బంగారు లోకం” సినిమాలోని “నీ ప్రశ్నలు నీవే…ఎవ్వరో బదులివ్వరుగా..” పాట గురించి.
నేను సినిమా చూడలేదు కనుక ఆ పాట ఎప్పుడొస్తుందో, ఎందుకొస్తుందో నాకు తెలీదు. కానీ, ఆ పాట ఎప్పుడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా ఎంతో విలువైన మాటలు చెబుతుందని నాకు అనిపిస్తుంది. నెలరోజులుగా దాదాపు ప్రతి రోజూ ఒకసారైనా ఈ పాట వింటున్నా. విన్న ప్రతిసారీ రకరకాల భావాలు కలుగుతున్నాయి – ఒకసారి అసహాయత పై అసహ్యం, ఒకసారి ఆశ చిగురించడం, ఓ సారి నవ్వు రావడం, ఓ సారి కళ్ళలో నీరు తిరగడం, ఓ సారి కోపం – ఇలా నేను రకరకాల ఉద్వేగాలకు లోనయ్యాను వివిధ సందర్భాల్లో ఈ పాట ద్వారా.
” నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా”

-ఔను నిజం ఔను నిజం నీవన్నది నిజం నిజం! నిజం నిజం! :)
ఈ రెండు లైన్లు మాత్రం, Ultimately, నీ తంటాలేవో నువ్వు పడాల్సిందే, అని నాకు నేను చెప్పుకున్న ప్రతిసారీ గుర్తొస్తాయి …
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

-నాకు నవ్వు వచ్చేది ఇక్కడే. ఎలా ఉంటుందంటే, బాగా అనుభవంలో తలపండిన మనిషి, కొత్తగా వచ్చినవాడికి “సూక్ష్మం గ్రహించు నాయనా!” అని చెబుతున్నట్లు ఉంటుంది నాకు. గ్రహించామా? గ్రహిస్తామా? అన్నది పక్కన పెడితే, నా కళ్ళ ముందు ఓ బ్రహ్మానందం తరహా పాత్ర ప్రత్యక్షమై, ఆ తరహా వ్యంగ్యం వినిపిస్తుంది నా చెవులకి.
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా

-ఫిలో ఫిలో…. ఇలా మొదలుపెట్టామంటే, ఇక ఐనట్లే. ప్రతీదీ ఇలాగే చెప్పుకుంటూ పోవచ్చు ;) ఎటొచ్చీ, నేను చెబితే జనానికి అర్థం కాదు. గొప్పోళ్ళు, సామాన్యుల భాషలో రాసి పుణ్యం కట్టుకుంటారన్నమాట.
“బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా”
-అని అంటూ ఉంటే, ధైర్యం చెప్పడానికి నేపథ్యం తయారు చేసుకుంటున్నారేమో అనుకుంటే,
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

-అని ఇంకా భయపెట్టేస్తారు. ఇదంతా నాకు రాత్రి ఆఫీసు నుంచి వస్తూ, ట్రాఫిక్ జాంలలో ఇరుక్కున్న ఏడుపుగొట్టు బస్సులో ఊసురోమని కూర్చుని వింటున్నప్పుడు పరమ పెస్సిమిస్టిగ్గా అనిపిస్తుంది. అయినా రిపీట్ కొట్టీ మరీ ఈ పాటనూ, బ్యాక్ బ్యాక్ కొట్టి ఈ లైన్లనూ మళ్ళీ మళ్ళీ వింటాను. ఎందుకంటే ఏం చెప్పను? అదంతే!
“అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా”

- Hmm… అనుకుంటూ ఎన్నిసార్లు విన్నానో ఈ వాక్యాలని. కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా….. అన్నప్పుడల్లా నేను జవాబు కోసం వెదుక్కుంటూనే ఉంటాను..ఉన్నాను.
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా

- ఈ రెండో లైన్ కూడా… దూరం గమ్యం ..ఏదీ తెలీని దారుల్లో నడుస్తున్న ప్రతి రాత్రీ గుర్తొస్తుంది..గుర్తొచ్చి…ఆ వాక్యానికి ప్రాణమొచ్చి నా ఎదుట నిలబడి నిలదీస్తున్నట్లు అనిపిస్తుంది.
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా”

- నిజమే… ఏది గెలుపు? ఎవరిది గెలుపు? రిలేటివ్ గా చెప్పగలమే కానీ, “ఇదే గెలుపు” అని చెప్పగలమా?
పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా

- ఒక్కసారి తప్పు చేస్తే, ఒక్కోసారి సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. ఆ తప్పుల చీకట్లో పడి మగ్గడం తప్ప. సూటిగా తగుల్తూ ఉంటుంది ఈ భాగం నన్ను. తగిలిన ప్రతిసారి చల్లగా భయపెడుతూ ఉంటుంది కూడా….
మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా

- కోల్పోతే గానీ దేని విలువా తెలీదేమో! ఒక్కోసారి కోల్పోయినవి తిరిగి పొందొచ్చు. ఒక్కోసారి, సరిదిద్దుకోలేని తప్పులు చేసినప్పుడు – ఇలాంటి వాక్యాలు చదువుకుని సాంత్వన పొందాల్సిందే ఏమో!
మొత్తానికి… జీవితంలోని చేదునిజాలని జీర్ణం చేసుకోలేకపోయినా…సగం వరకూ అయినా అంగీకరించడానికి నాకీపాట ఎంతో దోహదపడింది అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే….

కర్నూల్లో పాలగుమ్మి సాయినాథ్

దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పు అని ప్రముఖ జర్నలిస్టు, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 26న ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు కర్నూలు జిల్లా కేంద్రంలోని లలితాకళాసమితిలో ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఫోరం ఆధ్వర్యంలో 'ప్రజాస్వామ్యం-ధనప్రభావం' అనే అంశంపై సదస్సు జరిగింది. ఫోరం కన్వీనర్‌ ప్రసాద్‌శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పాలగుమ్మి సాయినాథ్‌ ముఖ్యోపన్యాసం చేశారు. దేశంలో కోటీశ్వరులు పెరిగిపోతున్నట్లే పేదరికం విపరీతంగా పెరిగిపోతోందని తెలిపారు. 1991కి ముందు దేశంలో ఒక్కరు కూడా డాలర్‌ బిలీనియర్లు లేరని, ఇప్పుడు 53 మంది డాలర్‌ బిలీనియర్లు ఉన్నారని చెప్పారు. వీరి చేతిలో 1/3వ వంతు 83 కోట్ల ప్రజల జిడిపితో సమానమని అన్నారు. కోటీశ్వరులు కలిగి ఉన్న దేశాల్లో భారతదేశానిది నాలుగో స్థానంమని అన్నారు.

స్ఫూర్తి

I LUV you EVRYDAY I Like you EVERYDAY I miss you EVERYDAY I need you EVERYDAY Bcoz EVERYDAY I really love you...!

శుభాకాంక్షలు


ప్రేమ పెళ్లితో ఒక్కటైనా మీకు శుభాకాంక్షలు. కావాలి మీరు స్ఫూర్తి మరో  జంటకు... మీకు సహకరిచినవారందరికీ కృతజ్ఞతలు....