Monday, December 12, 2022

కొత్త తరం "పాత తరం"

 


కొత్త తరం "పాత తరం" భుజాల మీద కూర్చుని చూస్తుంది కనుకనే ఎక్కువ దూరం చూడగలుగుతుంది.


-ఐజాక్ న్యూటన్


కులం మతంతో సంబంధం లేకుండా, మల్లె చెట్టును ఎవరు నాటినా పూలు సువాసనలు విరజిమ్ముతాయి. మంచి పనులు ఎవరు చేసినా మనం అభినందించాలి.



సంగీతం, నాట్యం వినోదంలో భాగం.! అవి మతం భక్తి దేవుడితో సంభందం లేనివి.! జనాలను ఆకర్షించడానికి మతాలు వాటిని ఉపయోగించుకుంటాయి.



కొత్త తరం "పాత తరం" భుజాల మీద కూర్చుని చూస్తుంది కనుకనే ఎక్కువ దూరం చూడగలుగుతుంది.


-ఐజాక్ న్యూటన్



ఎవరూ, ఎవరి దయా దాక్షిణ్యాలతో బతకకూడదు. సమాజంలో అన్నదానం ఆశించేంత అసమానతలు ఉండకూడదు. అందరూ స్వశక్తితో జీవించేవారిగా ఉండాలి.


ఏ పౌరుడు మరొక పౌరుడిని కొనగలిగేంత ధనం కూడబెట్టరాదు.

ఏ పౌరుడు తాను మరొకరికి అమ్ముడు పోయేటంత పేదవాడు కారాదు. 

-రూసో

Friday, June 8, 2012

దేశంలో వామపక్షేతర పార్టీలు రెండు ప్రధాన రాజకీయ కూటములుగా పనిచేస్తున్నాయి.ఇందులో ఒక పార్టీ కూటమి హిందుత్వ విధానాలను తలకెత్తుకోని పనిచేస్తుంటే.. ఇంకో కూటమి   నెహ్రు, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీల అనువంశిక పాలన కొనసాగించటమే లక్షంగా పనిచేస్తోంది. ఈ రెండు కూటములు బిజెపి సంకీర్ణం- కాంగ్రెస్ సంకీర్ణం సమాజం లోని ఫ్యూడల్ లక్షణాలను, సాంప్రదాయాలను అరువు చేసుకొని పని చేస్తున్నాయి. వామపక్ష పార్టీ నేతలు తమ తాత ముతాతల పేర్లు చెప్పి రాజకీయాలు నడిపే స్థితి లేదు. అంటే వలసవాద వ్యతిరేక పోరాట సాంప్రదాయంలో అదునికతకు వుండే  చోటును భారత రాజకీయాల్లో వామపక్షాలు దక్కించుకున్నాయి.

సోషలిజం మళ్లీ ఎప్పుడు బతికొచ్చింది?!

నికృష్టమైన కాపిటలిజానికి ఔన్నత్యం ఆపాదిస్తున్నారు. వికారమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు అందమైన మేకప్‌ చేస్తున్నారు. చిన్న భార్య అందంగా ఉన్నట్లు చెప్పడానికి పెద్ద భార్యను అనాకారిగా చిత్రీకరించాడట వెనకటికెవడో. జాహ్నవి చేస్తున్న, చేసిన ప్రయత్నం అదే. శ్రామిక రాజ్యమైన సోషలిజాన్ని వికృతంగా చిత్రీకరించకపోతే క్యాపిటలిజంలో కష్టాలనుభవిస్తున్న శ్రామికులు సోషలిజంవైపు మరలుతారు. అదే జరిగితే 'జాహ్నవి' గారి పెట్టుబడిదారీ స్వర్గం కప్పకూలిపోతుంది.
అదేమిటి..... సోషలిజం ఎప్పుడో చచ్చిపోయిందన్నారు. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నంతోనే సోషలిజం కడతేరిపోయిందన్నారు. దాన్ని శాశ్వతంగా పాతిపెట్టేశామన్నారు. లెనిన్‌ విగ్రహాలు పడగొట్టి ఆనందించారు. మార్క్సిస్టు గ్రంథాలు తగలేసి మురిసిపోయారు. చైనా పెట్టుబడిదారీ పంథాలోకి మారిపోయింది, వియత్నాం మారిపోయింది, క్యూబా మారిపోతోంది, ఇంక సోషలిజం ఎక్కడుందన్నారు. ప్రపంచమంతా పెట్టుబడిదారీ పంథాలో సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో అప్రతిహతంగా ముందుకుపోతోందన్నారు.... మళ్లీ ఇప్పుడీ చర్చేమిటి?
ఆంధ్ర జ్యోతిలో 'జాహ్నవి' అనే ముసుగు వ్యక్తి మేధో మథనం చేస్తూ 'సోషలిజం అనైతిక స్వప్నం' అని చెబుతుంటే, సోషలిజానికి వ్యతిరేకంగా పత్రిక వ్యాసపరంపరలు వెలువరిస్తూ ఉంటే ఇంతవరకు సోషలిజం గురించి జరిగిన ప్రచారమంతా ఒట్టిదేనా అన్న అనుమానం కలుగడం లేదూ?
అంటే.... సోషలిజాన్ని గురించి ఇప్పటికీ స్వప్నించే వాళ్లున్నారంటారా 'జాహ్నవి' గారూ? ఒక ప్రముఖ పత్రికలో వ్యాసాల మీద వ్యాసాలు రాసి మళ్లీ మరోసారి చంపడానికి ప్రయత్నం చేయాల్సినంత బలంగా సోషలిజం భావన ప్రజల్లో వ్యాపిస్తోందంటారా?
సోవియట్‌లో కుప్పకూలిపోయాక, తూర్పుయూరప్‌లో దెబ్బతిన్నాక, ప్రపంచమంతటా తిరస్కరణకు గురైనాక ఇంకా సోషలిజం ప్రజలు స్వప్నించేంతటి సుందర మనోహరంగా కనిపిస్తోందంటారా? మీరు దానికి బురదపూసి, కొమ్ములు పెట్టి, కోరలు తగిలించి, హిట్లరు, ముస్సోలినీలంతటి భయంకరంగా తయారుచేస్తేనే గాని ప్రజలు తిరస్కరించలేనంతటి సుందరంగా కనిపిస్తోందంటారా? సోషలిజం ప్రజలను అంతగా ఆకర్షిస్తోందా?
సోషలిజంలోనే తమ కష్టాలు తీరుతాయని ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారంటారా? పెట్టుబడిదారీ వ్యవస్థలోని రుగ్మతలన్నింటినీ అపాదిస్తేనేగాని ప్రజలు అసహ్యించుకోలేనంతటి ఆకర్షణీయంగా ఉందా సోషలిజం? ప్రపంచాన్ని పీడించేందుకు అమెరికా చేసే కిరాతకాలన్నింటినీ, మొన్న రీగన్‌, నిన్న బుష్‌, నేడు ఒబామా చేసిన, చేస్తున్న నీచమైన యుద్ధాలన్నింటినీ, కోట్లాది శ్రమ జీవుల స్వేద ఫలాన్ని కొద్దిమంది కుబేరులకు కట్టబెెట్టే విధానాలన్నిటినీ, ప్రపంచ జనాభాలో అత్యధికుల కష్టాలకూ, కడగండ్లకూ కారణాలన్నిటినీ, నెహ్రూ, ఇందిరాగాంధీ విధానాలతో బాటు నేటి మన్మోహన్‌ విధానాలవరకూ అన్నిటినీ....వీటన్నిటినీ సోషలిజానికి ఆపాదించడం వెనుక అర్థమదేనా?
పూర్‌ 'జాహ్నవి' కాపిటలిజాన్ని సమర్థించేందుకు ఎంతగా తంటాలు పడుతున్నారు. నికృష్టమైన కాపిటలిజానికి ఔన్నత్యం ఆపాదిస్తున్నారు. వికారమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు అందమైన మేకప్‌ చేస్తున్నారు. చిన్న భార్య అందంగా ఉన్నట్లు చెప్పడానికి పెద్ద భార్యను అనాకారిగా చిత్రీకరించాడట వెనకటికెవడో. జాహ్నవి చేస్తున్న, చేసిన ప్రయత్నం అదే. శ్రామిక రాజ్యమైన సోషలిజాన్ని వికృతంగా చిత్రీకరించకపోతే క్యాపిటలిజంలో కష్టాలనుభవిస్తున్న శ్రామికులు సోషలిజంవైపు మరలుతారు. అదే జరిగితే 'జాహ్నవి' గారి పెట్టుబడిదారీ స్వర్గం కప్పకూలిపోతుంది. అందుకనే అనుకుంటా ఈ ముసుగు వ్యక్తి పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించే వైపరీత్యాలన్నిటినీ సోషలిజానికి ఆపాదించారు.
400 సంవత్సరాల క్రితం పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి రాయాల్సిన వ్యాసాన్ని 'జాహ్నవి' ఇప్పుడు రాశారు. ''కాపిటలిజమనేది ఉదార స్వేచ్ఛావాద భావజాలానికి ఆర్థిక, రాజకీయ కోణం' అనేది ఆ వ్యవస్థ పుట్టుకనాటి వాస్తవం. బహుశా పెట్టుబడిదారీ వ్యవస్థగురించి పాఠ్యపుస్తకాల్లో అచ్చొత్తించిన విషయాలను 'జాహ్నవి' యథాతథంగా తీసుకున్నట్లున్నారు. అంతే కాదు పెట్టుబడిదారీ పూర్వ వ్యవస్థల్లో ఉత్పత్తి విధానాన్ని, పెట్టుబడిదారీ విధానంలోని ఉత్పత్తి విధానంతో కలగలిపి తాను గందరగోళపడి, పాఠకులను గందరగోళంలోకి నెట్టడానికి ప్రయత్నించారు. తెలియక చేశారా లేక కావాలని పాఠకులను తప్పుతోవపట్టించడానికి చేశారా? ఈ ముసుగు వ్యక్తి ఏమి రాశారో చూడండి: ''వస్తు సేవలను స్వచ్ఛందంగా ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా మనిషి మనుగడను సాగిస్తాడు. మామూలు భాషలో - మనిషి తను తయారు చేసే వాటిని ఇతరులకు అమ్ముకుని తనకు కావలసిన, ఇతరులు తయారు చేసిన వాటిని కొనుక్కొని సుఖ సంతోషాలు పొందుతాడు. ఇతరులకు హాని కలిగించనంత వరకు మనిషి చేసే ఈ పరిశ్రమకు ఎవరూ, ప్రభుత్వం కూడా అడ్డు రాకూడదు. ఎవరైనా అడ్డుకుంటే, వారి నుంచి రక్షించడానికే తప్ప, ప్రభుత్వం ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ రకంగా కాపిటలిజం భావజాలపరంగా శాంతిని కోరుకుంటుంది. ఆత్మ రక్షణకు తప్ప ఏ రకమైన హింసను, ఏ రకమైన యుద్ధాలనూ ప్రోత్సహించదు, సమర్థించదు. ఇష్టం, సమ్మతం లేకుండా ఒకరి దగ్గర్నుండి లాక్కుని ఇంకొకరికి వదిలిపెట్టడాన్ని వ్యతిరేకిస్తోంది.''
పెట్టుబడిదారుల దగ్గర అపారమైన పెట్టుబడి ఎలా పోగయిందంటారు 'జాహ్నవి' గారు? 'తాను తయారు చేసిన వాటిని ఇతరులకు అమ్ముకుని, తనకు కావలసిన, ఇతరులు తయారు చేసిన వాటిని కొనుక్కొనే' ఇన్ని లక్షల కోట్ల సంపద పోగుచేసుకున్నారా? తరతరాలుగా కోట్లాది శ్రమజీవులు సృష్టించిన సంపద కొద్ది మంది దగ్గర పోగుపడడం వెనుక 'జాహ్నవి'కి శ్రమ దోపిడీ అనేదే కనిపించకపోవడానికి కారణం తను పెట్టుకున్న పెట్టుబడిదారీ కళ్లద్దాలు కావచ్చు. కనీసం తను చరిత్ర చదువుకున్నా బాగుణ్ణు, 13వ శతాబ్దంలో ఇటలీ వర్తకులు పెట్టుబడి పోగుచేసుకోడానికి క్రూసేడుల పేరుతో సృష్టించిన రక్తపాతం కనిపించేది. 14, 15 శతాబ్దాల్లో ఐరోపా వర్తకులు లాభాలు దండుకోడానికి కోట్లాది ఆఫ్రికన్‌ నల్లజాతీయులను బందీలుగా పట్టుకుని వారిచేత బానిస చాకిరీ చేయించుకున్న తీరు అర్ధమయ్యేది. ఆ క్రమంలో ఎన్ని లక్షల మంది నల్లజాతి ప్రజలను నాటి పెట్టుబడిదారీ వ్యవస్థ పొట్టనపెట్టుకుందో తెలిసివచ్చేది. కనీసం మన దేశంలో వ్యాపారం కోసం వచ్చిన తెల్ల పెట్టుబడిదారులు మన ప్రజలపై రెండు శతాబ్దాల పాటు సాగించిన దమనకాండ గురించీ, లక్షలాది ప్రజల ప్రాణాలు తీసిన దాని పైశాచికత్వాన్ని గురించీ 'జాహ్నవి' చదివి ఉంటే... 'కాపిటలిజం భావజాలపరంగా శాంతిని కోరుకుంటుంది. ఆత్మరక్షణకు తప్ప ఏ రకమైన హింసను, ఏ రకమైన యుద్ధాలనూ ప్రోత్సహించదు, సమర్ధించదు' అని రాసి ఉండేవారు కాదు. చరిత్ర చదవకపోతే పోనీ కనీసం వర్తమాన విషయాలు కూడా తెలియకుండా వ్యాసాలు రాస్తే ఎలా? ఇరాక్‌పై అమెరికా దాడి ఎందుకు చేసిందంటారు ముసుగు మనిషీ? మానవ హనన ఆయుధాలకోసం, ఉగ్రవాదుల వేటకోసం కాదని మీ అమెరికన్‌ కాపిటలిస్టు మిత్రులు చెప్పారు కదా? పదిలక్షల మంది ఇరాకీల ప్రాణాలు తీసింది చమురు సంపద దోపిడీ కోసమేనని చిన్న పిల్లలు కూడా ఇప్పుడు చెబుతున్నారు మీకు మాత్రం అర్థం కావడం లేదా? ఆఫ్ఘన్‌పై యుద్ధం తాలిబన్లను తుదముట్టించడానికే అయితే మరి తాలిబాన్లను తయారు చేసిందెవరో, ఎందుకోసమో చెప్పగలరా?
అందుకే కారల్‌ మార్క్స్‌...''పెట్టుబడి తలనుండి కాలి వరకూ, ప్రతి అణువూ రక్తమూ, బురదతో తడిచి వస్తుంది'' అని చెప్పాడు. అధిక లాభాల దురాశే పెట్టుబడిదారులచేత ఎంతటి భయంకరమైన నేరాలనైనా చేయిస్తుందని ఆయన విశదీకరించాడు. అనేక సంవత్సరాలు శ్రమించి పెట్టుబడి పుట్టుక రహస్యాన్ని ఛేదించిన మార్క్స్‌ తన పెట్టుబడి గ్రంథం ఫుట్‌నోట్‌లో టి.జె. డన్నింగ్‌ అనే ట్రేడ్‌యూనియన్‌ నాయకుని వాక్యాలను ఈ విధంగా ఉటంకించాడు: ''తగిన లాభం వస్తుందనుకుంటే పెట్టుబడి చాలా ధైర్యంగా ప్రవర్తిస్తుంది. 10 శాతం లాభం నికరంగా వస్తుందనుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళతుంది. 20 శాతం దానిలో ఆసక్తిని రేపుతుంది. 50 శాతం వస్తుందంటే ఎంతకైనా తెగిస్తుంది. 100 శాతం లాభం వస్తుందంటే అన్ని రకాల మానవ విలువలనూ తుంగలో తొక్కడానికి సిద్ధమైపోతుంది. 300 శాతం వస్తుందనుకుంటే అది చేయడానికి సాహసించని నేరమే ఉండదు. ఎదుర్కొనడానికి సిద్ధపడని ప్రమాదమే ఉండదు. చివరికి తన యజమానికి ఉరిపడే అవకాశమున్నా కూడా అది వెనుకడుగు వేయదు.'' ఈ విధంగా ఎలాగైనా గరిష్ట లాభాలు గడించాలన్న దురాశే, పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ఈ అంతర్గత లక్షణమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. అంతేగాని కొంతమంది దురాశో, నియంత్రణ వ్యవస్థలు సరిగ్గా లేకపోవడమో, లేకపోతే 'జాహ్నవి' పేర్కొన్నట్లు అమెరికాతో సహా పెట్టుబడిదారీ దేశాల్లోని నాయకులందరికీ 'సోషలిజం మత్తు' ఎక్కడమో కాదు.
పెట్టుబడి... పరిశ్రమల ప్రహరీలు దాటి, దేశాల సరిహద్దులు ఛేదించి అంతర్జాతీయ గుత్తపెట్టుబడిగా మారిన నేటి తరుణంలో పెట్టుబడిదారీ వ్యవస్థ స్వేచ్ఛాపోటీ పద్ధతిలో అభివృద్ధి చెందిన కాలం గురించి 'జాహ్నవి' ఇప్పుడు కలలు కంటున్నారు. మోన్‌శాంటో లాంటి అంతర్జాతీయ గుత్త విత్తన కంపెనీలు వర్ధమాన దేశాల వ్యవసాయాన్ని బలవంతంగా చేజిక్కించుకుంటున్న వైనం తనకు కనిపించడం లేదు. కూల్‌ డ్రింకు మార్కెట్‌లో కోలా కంపెనీలు చేస్తున్న స్వైర విహారానికి తలలు తెగి పడుతున్న వర్ధమాన దేశాల బాట్లింగ్‌ కంపెనీలు కనిపించడం లేదు. సమాచార-వినోద-కమ్యూనికేషన్స్‌ మార్కెట్‌లో స్వేచ్ఛాపోటీని హరించి బలిసి పోతున్న స్టార్‌, టైమ్‌-వార్నర్‌, వాల్ట్‌డిస్నీ లాంటి గుత్త సంస్థలు, చిల్లర మార్కెట్లను కబళించేందుకు వస్తున్న వాల్‌ మార్ట్‌లు, మోటారు రంగాన్ని స్వాహాచేసిన ఫోర్డులు, టయోటాలు, బెంజ్‌ కంపెనీలు కనిపించడమే లేదు.
పెట్టుబడిదారీ వ్యవస్థలో స్వేచ్ఛ గురించి 'జాహ్నవి' చాలా ఆశలు పెట్టుకున్నట్లున్నారు. అంతర్జాతీయ గుత్త సంస్థలు ఉద్బోధిస్తున్న నయా-ఉదారవాద ఆర్థిక విధానాలు అనుసరించడం మినహా మన దేశానికి మరో మార్గం లేదని వాదిస్తున్న మన్మోహన్‌ సింగ్‌ హయాంలో తను స్వేచ్ఛను చూడ్డమే వింతగా ఉంది.
అంతర్జాతీయ అప్పుల కోసం ప్రపంచ బ్యాంకు పెట్టిన షరతులను పార్లమెంటు, అసెంబ్లీల్లో చర్చలు కూడా లేకుండా ఆమోదించి అమలు చేస్తున్న ప్రభుత్వాల పాలనలో తను స్వేచ్ఛను చూస్తున్నారు. ఇరాన్‌పట్ల, ఇజ్రాయిల్‌ పట్ల, ఇరుగు పొరుగు దేశాల పట్ల అమెరికా ఎలా ఉండమని చెబితే అలా వ్యవహరిస్తున్న భారత విదేశాంగ విధానంలో 'జాహ్నవి' స్వేచ్ఛ చూస్తున్నారు. అణు ఒప్పందమైనా, రక్షణ ఒప్పందమైనా అమెరికా మన దేశం మెడలు వంచి సంతకాలు చేయిస్తూ ఉంటే అదంతా 'జాహ్నవి'కి స్వేచ్ఛలాగా గోచరిస్తోంది.
పెట్టుబడిదారీ ప్రచారకులంతా చూస్తున్నట్లే ఈ ముసుగు మనిషి కూడా వాస్తవ ప్రపంచాన్ని తల్లకిందులుగా చూస్తూ, ప్రజలకు చూపిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే స్వేచ్ఛకు సమానార్థంగా, సోషలిజం అంటే బలవంతం లేక నిరంకుశత్వంగా చెబుతున్న 'జాహ్నవి' అభిప్రాయాన్ని తల్లకిందులు చేస్తే వాస్తవ ప్రపంచం కనిపిస్తుంది. కాపిటలిజంలో ఉత్పత్తి సాధనాలమీద పెట్టుబడిదారుల అధిపత్యం ఉంటుంది కనుక కార్మికులు సృష్టించే అదనపు శ్రమను వారు దోచుకోగలుగుతున్నారు.
ఇక్కడ కార్మికులకు ఏ పెట్టుబడిదారునివద్దనైనా శ్రమను అమ్ముకునే స్వేచ్ఛ ఉంది గాని శ్రమను అమ్ముకోకుండా బతికే స్వేచ్ఛ లేదు. ఎందుకంటే బతకడానికి కావలసిన ఉత్పత్తి చేసుకునే సాధనాలు వారిదగ్గర లేవు కాబట్టి. ఈ వ్యవస్థలో పెట్టుబడిదారులకు కార్మికుల శ్రమ దోచుకోడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే ఉత్పత్తి సాధనాలను వారు తమ ఆధీనంలో పెట్టుకున్నారు కాబట్టి. అందువల్ల పెట్టుబడిదారీ వ్యవస్థలో కొద్దిమంది పెట్టుబడిదారులకు స్వేచ్ఛ ఉంటుంది. విస్తారమైన కార్మికులకు స్వేచ్ఛ ఉండదు. శ్రమను అమ్ముకోవడం మినహా వారికి గత్యంతరం ఉండదు. ఉత్పత్తి సాధనాలపై కొద్ది మంది పెట్టుబడిదారుల స్థానంలో విస్తారమైన కార్మికులకు ఆధిపత్యం వచ్చినప్పుడు మాత్రమే వారు శ్రమను అమ్ముకునే గత్యంతరం లేని పరిస్థితులనుండి విముక్తి పొందుతారు. అప్పుడే వారికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. కాని 'జాహ్నవి' కొద్దిమంది పెట్టుబడిదారులకు స్వేచ్ఛ గల, విస్తారమైన శ్రామికులకు నిరంకుశంగా అణచివేసే కాపిటలిజాన్ని స్వేచ్ఛా ప్రపంచంగానూ, విస్తారమైన శ్రామికులకు స్వేచ్ఛ లభించే సోషలిజాన్ని నిరంకుశ వ్యవస్థ గానూ తలకిందులుగా చూపిస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారీ ప్రచారకుల బాటలోనే నడుస్తున్నారు. అందుకే తను పెట్టుబడిదారీ వ్యవస్థలో రుగ్మతలకు కారణాలన్నిటినీ ఆ వ్యవస్థలో కాకుండా సోషలిజంలో వెదుకుతున్నారు.
పూర్వ కాలంలో లాగా కాదు, నేడు ఏ వస్తువు ఉత్పత్తి కావాలన్నా వేలు, లక్షల కార్మికులు శ్రమ తోడయితేనే గాని కావడం లేదు. అంటే ఉత్పిత్తి అంతకంతకూ సామాజికం అవుతోంది. కాని ఉత్పత్తయిన సంపద మాత్రం రానురాను మరింతగా కొద్దిమంది దగ్గర పోగుపడుతోంది. ఈ వైరుధ్యం పెరుగుతోంది. పెరిగి పెరిగి ఏనాటికైనా బద్దలవుతుంది. 'జాహ్నవి'లాంటి వారు కనే 'అనైతిక స్వప్నాలు' ఈ పరిణామాన్ని ఆపలేవు. ఎన్ని సార్లు చంపి పాతిపెట్టినా సోషలిజం మళ్లీమళ్లీ బతికి బయటకొస్తుందని 'జాహ్నవి' లాంటి వారి రచనలే తెలియజేస్తున్నాయి.
సోషలిజం వస్తుంది! ఎందుకంటే అదే భవిష్యత్తు గనుక!!

Tuesday, June 5, 2012

ఇటీవల గ్లోబల్‌ ఇంటగ్రేటరీ సర్వీసెస్‌ అనే సంస్థ గత 50 ఏళ్లలో భారతదేశంలో రూ. 20 లక్షల కోట్లు లూటీ జరిగిందని బహిర్గతం చేసిందని తెలిపారు. ఈ 20 లక్షల కోట్ల కేవలం నల్లధనమేనని చెప్పారు. స్మగ్లింగ్‌, అవినీతి, అక్రమాలకు సంబంధం లేకుండానే కార్పొరేట్‌ సంస్థలు, కోటీశ్వరులు ఈ డబ్బును తీసుకెళ్లి స్విస్‌ బ్యాంకు, బెర్ముడా, లక్సంబర్గ్‌ లాంటి చోట్ల దాచారని తెలిపారు.

కోటీశ్వరులు, కార్పొరేట్‌ సంస్థల అధినేతలు, బడారాజకీయ వేత్తలు కలిసి దేశాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల గ్లోబల్‌ ఇంటగ్రేటరీ సర్వీసెస్‌ అనే సంస్థ గత 50 ఏళ్లలో భారతదేశంలో రూ. 20 లక్షల కోట్లు లూటీ జరిగిందని బహిర్గతం చేసిందని తెలిపారు. ఈ 20 లక్షల కోట్ల కేవలం నల్లధనమేనని చెప్పారు. స్మగ్లింగ్‌, అవినీతి, అక్రమాలకు సంబంధం లేకుండానే కార్పొరేట్‌ సంస్థలు, కోటీశ్వరులు ఈ డబ్బును తీసుకెళ్లి స్విస్‌ బ్యాంకు, బెర్ముడా, లక్సంబర్గ్‌ లాంటి చోట్ల దాచారని తెలిపారు. వీటి ఖాతాదారుల వివరా లు ప్రభుత్వం వద్ద ఉన్నాయని అన్నారు. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వీటి ఖాతాదారుల పేర్లు చెప్పమంటే అది బ్యాంకు నిబంధనలకు విరుద్ధ మని చెబుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన పేద రైతుల పేర్లను మాత్రం బహిర్గతం చేస్తారని చెప్పారు. దేశం నుంచి తరలిపోయిన 20 లక్షల కోట్ల డాలర్లలో 50 శాతం డబ్బు ప్రపంచీకరణ తర్వాతే తరలి వెళ్లిందని అన్నారు. దాదాపు 2 వేల అకౌంట్లలో ఈ డబ్బు ఉందని తెలిపారు. ఈ ధనమే వస్తే దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అక్రమంగా డబ్బును బ్యాంకుల్లో దాచే ఖాతాదారులు ఇండియాలోనే ఎక్కువ అని ఐఎంఎఫ్‌ రిపోర్టు చెబుతుందని అన్నారు. దేశంలోని రైతులు అప్పులు దొరకక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు. 1995 నుంచి 2010 వరకూ దేశంలో 2.56 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇందులో 2/3వ వంతు ఐదు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 30 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీలు ఇస్తారు కానీ వ్యవసాయ రంగానికి మాత్రం ఇవ్వరని విమర్శించారు. మెర్సిడెన్‌ బెంజిలాంటి కార్లు కొంటే 7 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకులు రైతులు ట్రాక్టర్లను కొంటే 12 శాతానికి ఇస్తున్నా యని అన్నారు. సాధారణ రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో బయట 24శాతం వడ్డీకి అప్పులు తెచ్చుకుని వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయరంగంలో గత ఐదేళ్లలో పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థలైన టాటా, అంబాని, నీరారాడియా లాంటి వారు దేశాన్ని పాలిస్తున్నారని తెలిపారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది టాటా, అంబాని లాంటి వారు నిర్దేశిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు అని తెలిపారు.