దేశంలో వామపక్షేతర పార్టీలు రెండు ప్రధాన రాజకీయ కూటములుగా పనిచేస్తున్నాయి.ఇందులో ఒక పార్టీ కూటమి హిందుత్వ విధానాలను తలకెత్తుకోని పనిచేస్తుంటే.. ఇంకో కూటమి నెహ్రు, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీల అనువంశిక పాలన కొనసాగించటమే లక్షంగా పనిచేస్తోంది. ఈ రెండు కూటములు బిజెపి సంకీర్ణం- కాంగ్రెస్ సంకీర్ణం సమాజం లోని ఫ్యూడల్ లక్షణాలను, సాంప్రదాయాలను అరువు చేసుకొని పని చేస్తున్నాయి. వామపక్ష పార్టీ నేతలు తమ తాత ముతాతల పేర్లు చెప్పి రాజకీయాలు నడిపే స్థితి లేదు. అంటే వలసవాద వ్యతిరేక పోరాట సాంప్రదాయంలో అదునికతకు వుండే చోటును భారత రాజకీయాల్లో వామపక్షాలు దక్కించుకున్నాయి.
No comments:
Post a Comment