Saturday, February 19, 2011

కర్నూల్లో పాలగుమ్మి సాయినాథ్

దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పు అని ప్రముఖ జర్నలిస్టు, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 26న ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు కర్నూలు జిల్లా కేంద్రంలోని లలితాకళాసమితిలో ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఫోరం ఆధ్వర్యంలో 'ప్రజాస్వామ్యం-ధనప్రభావం' అనే అంశంపై సదస్సు జరిగింది. ఫోరం కన్వీనర్‌ ప్రసాద్‌శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పాలగుమ్మి సాయినాథ్‌ ముఖ్యోపన్యాసం చేశారు. దేశంలో కోటీశ్వరులు పెరిగిపోతున్నట్లే పేదరికం విపరీతంగా పెరిగిపోతోందని తెలిపారు. 1991కి ముందు దేశంలో ఒక్కరు కూడా డాలర్‌ బిలీనియర్లు లేరని, ఇప్పుడు 53 మంది డాలర్‌ బిలీనియర్లు ఉన్నారని చెప్పారు. వీరి చేతిలో 1/3వ వంతు 83 కోట్ల ప్రజల జిడిపితో సమానమని అన్నారు. కోటీశ్వరులు కలిగి ఉన్న దేశాల్లో భారతదేశానిది నాలుగో స్థానంమని అన్నారు.

No comments:

Post a Comment